మహేష్ బాబు, దీపిక పదుకొనె... ఈ రెండు పేర్లు గత కొన్ని రోజులుగా తెలుగు పరిశ్రమలో జంటగా చక్కర్లు కొడుతున్నాయి. తమాషా సినిమా పబ్లిసిటీలో భాగంగానే మహేష్ బాబు తనకు బాగా క్లోజని దీపిక ఇక్కడి మహేష్ బాబు అభిమానుల హృదయాలని కొల్లగొట్టేసింది. ఇక ఈసారి మహేష్ వంతు. దీపిక పదుకొనె, తనకు బాగా నచ్చిన నేటితరం నటీమణి అని కితాబిచ్చేసాడు. ఇలా ఒకరి వీపునొకరు బాగా గీక్కుంటుంటే అభిమానులకు తెగ సంబరంగా ఉంది. మరి నిజంగానే మహేష్ బాబు సరసన దీపిక పదుకొనె ఓ సినిమాలో నటిస్తే ఇంకెంత మజాగా ఉంటుందో ఊహించుకోండి. మీ ఈ ఊహను నిజం చేసేందుకు దర్శకుడు మురుగదాస్ కొత్త స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మధ్యలో స్టార్ట్ కాబోయే మహేష్-మురుగదాస్ ప్రాజెక్టులోకి దీపిక పదుకొనె హీరోయిన్ పాత్రతో సౌత్ లోనికి ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉందని కాలీవుడ్ సమాచారం. ముందుగా శృతి హసన్ పేరును అనుకున్నప్పట్టికీ వంద కోట్ల పై బడ్జెట్ దృష్ట్యా కొత్త కాంబినేషన్ అయితే మరింత గ్లామరసుగా ఉంటుందని మహేష్, దీపికల జోడీ మీద దృష్టి పెట్టారంట మురగదాస్. ప్రెజెంట్ బాజీరావు మస్తానితో బిజీగా ఉన్న దీపికను తొందరలోనే అప్రోచ్ అయ్యి కథను కూడా వినిపించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.