విపరీతమైన పోటీ నడుమ బాహుబలి తెలుగు వర్షన్ టీవీ హక్కులను సొంతం చేసుకున్న మా టీవీ అనుకున్నదాని కంటే గొప్పగానే మొదటి సారి టీవీ స్క్రీనింగ్ మీద రికార్డు టీఆర్పీలు సాధించింది. ఇప్పుడు రెండోసారి ప్రదర్శనకు కూడా గత కొన్నివారాలుగా హై లెవెల్లో పబ్లిసిటీ చేస్తోంది. మరి టీవీల్లో దేశం నలుమూలలకి వెళ్ళిపోయిన బాహుబలిని ఇప్పుడు ఆన్ లైన్లోకి యూట్యూబ్ ద్వారా తీసుకొచ్చి 4కే హై రిజొల్యూషన్ మీద వదిలారు. కానీ ఇది ఫ్రీగా కాకుండా పే-పర్-వ్యూ పేరిట ప్రతి వ్యూకి నూట యాభై రూపాయలు చెల్లించమనడము కాస్తంత ఇబ్బంది కలిగించే అంశం. ఫారిన్ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రేక్షకులు ఈ స్కీముకి ఎంతలా ఆకర్షితులవుతారో తెలియదు గానీ అటు డీవీడీ క్వాలిటీ పైరసీ కాపీలు, ఇటు టీవీల్లో ఒకటోస్సారి, రెండోస్సారి అంటూ వచ్చేస్తోంటే భారతదేశంలోని సినీ అభిమానులు మాత్రం ఇటువంటి వాటికి లొంగరు అన్నది ఓ విశ్లేషణ. ఆల్రెడీ థియేట్రికల్, శాటిలైట్ మరియు ఇతరత్రాల పేరిట కోట్లల్లో లాభాలు గడించిన బాహుబలి నిర్మాతలు ఇప్పుడు యూట్యూబ్ మీద ఎంతలా క్యాష్ చేసుకుంటారో వెయిట్ అండ్ సీ. సినిమా తీయడంలో మాత్రమే టెక్నాలజీని వాడుకోవడం కాదు, సినిమాను అమ్ముకోవడంలోను టెక్నాలజీని వాడుకుని బాహుబలి కొత్త పంథాను అనుసరిస్తోంది.