Advertisementt

కోన వాదన..!

Thu 03rd Dec 2015 03:30 PM
kona venkat,brucelee,akhil movie,shankarabharanam movie  కోన వాదన..!
కోన వాదన..!
Advertisement
Ads by CJ

స్టార్‌ రైటర్‌ కోనవెంకట్‌ పనిచేసిన పెద్ద చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి రామ్‌చరణ్‌ నటించిన 'బ్రూస్‌లీ' అక్కినేని అఖిల్‌ నటించిన 'అఖిల్‌' చిత్రాలు ఈ కోవలోవే. అయితే ఇప్పటికే కోన 'బ్రూస్‌లీ' అపజయం పాలవ్వడం వెనుక తన ప్రమేయం లేదని, తాను రాసిన కథలో శ్రీనువైట్ల పలు మార్పులు చేర్పులు చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక 'అఖిల్‌'మూవీ గురించి మాట్లాడుతూ... ఆ సినిమా ఫెయిల్యూర్‌కి తనకు లింక్‌ పెట్టవద్దని.. తాను కేవలం ఈ చిత్రానికి మాటలు మాత్రమే రాశానని, సినిమా కథ, స్క్రీన్‌ప్లే వేరే వారు రాశారని చెప్పుకొచ్చాడు. నా పని రచయిత.. దర్శకుడు చెప్పింది రాసివ్వడమే నా పని. మహా అయితే వాళ్లకు సలహాలు, సూచనలు చేయగలం. అంతేగానీ తలదూర్చలేము. త్వరలో రాబోతున్న 'శంకరాభరణం' సినిమా సక్సెస్‌తో నేనేమిటో నిరూపించుకుంటాను.. అని అంటున్నాడు కోన. మరి ఆయన వాదనతో ఎందరు ఏకీభవిస్తారు? అనేది వేచిచూడాల్సివుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ