ఈమధ్య అవకాశాలు లేక డీలాపడిపోయిన సంగీత సంచలనం హారీస్ జైరాజ్ ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్‌లు ఓకే చేయించుకుని ఒక్కసారిగా మరలా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆయన తెలుగులో సంగీతం అందించిన ఒక్క చిత్రం కూడా సరైన విజయం సాధించలేదు. 'వాసు' నుండి 'ఆరెంజ్' వరకు ఆయన సంగీతం అందించిన అన్నిచిత్రాలు ఫ్లాప్‌గానే మిగిలాయి ఈ ఖాతాలో మహేష్‌బాబు నటించిన 'సైనికుడు' కూడా ఉంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి సంగీతం అందించే అవకాశం హరీష్‌కే సొంతం అయింది. కాగా మురుగదాస్ దర్శకత్వం వహించిన 'గజిని, సెవెన్త్‌సెన్స్, తుపాకి' చిత్రాలు మురుగదాస్‌కు బాగా పేరు తెచ్చాయి. దీంతో ఆయన తెలుగుతోపాటు తమిళంలో కూడా తెరకెక్కించనున్న మహేష్ మూవీకి హరీస్‌జైరాజ్‌ని ఎంపిక చేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు హరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన 'సింగం' సిరీస్‌లోని చిత్రాలకు సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందించినప్పటికీ తాజాగా రూపొందనున్న 'సింగం' సిరీస్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో హరీస్‌జైరాజ్‌ను తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లతోపాటు గౌతమ్‌మీనన్-జయం రవి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం, విక్రమ్-నయనతారలతో రూపొందనున్న మూవీకి కూడా హరీష్‌జైరాజే సంగీతం అందించనున్నాడు. సో.. మరలా హరీష్ జైరాజ్ మ్యూజిక్‌ను వినే అవకాశం తమిళ, తెలుగు ప్రేక్షకులకు కలుగనుంది.