Advertisementt

ఆడ వాసన తగలని రవితేజ!

Thu 03rd Dec 2015 10:17 AM
bengal tiger dialogues,raviteja,sampath nandi  ఆడ వాసన తగలని రవితేజ!
ఆడ వాసన తగలని రవితేజ!
Advertisement
Ads by CJ

మీరు అరిస్తే అరుపులు, నేను అరిస్తే మెరుపులే అంటూ మెగా అభిమానులని రచ్చతో ఉర్రూతలూగించిన సంపత్ నంది కలం ఇప్పుడు రవితేజ ఫ్యాన్సుని కూడా ఊగిపోయేలా చేయనుంది. అటు హీరో ఎలివేషన్, ఇటు కామెడీని సమపాళ్ళలో జోడించి సంపత్ నంది రాసిన హీరో రవితేజ క్యారెక్టరైజేషన్ బెంగాల్ టైగర్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. మామూలుగానే రవితేజ కదులుతుంటే ఎనర్జీ పెల్లుబుకుతుంది. అటువంటిది సంపత పెన్ను కింద బెంగాల్ టైగర్ పెడితే డైలాగులు పేలకుండా ఉంటాయా. ఇప్పటికే ట్రైలరులో నేను సపోర్టు లేకుండా వచ్చినోన్ని అని మాస్ మహారాజా తన ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అంటుంటే, వీడు జాతి జంతువు అని తమన్నా కూడా రవితేజను మోసేస్తుంటే హీరోయిజం పతాక స్థాయికి చేరుకునేలా ఉంది. మరి సరసమైన హాస్యం కోసం ఇదిగో ఈ డైలాగ్ ఒకటి వినండి. చాన్స్ లేక... ఆడ వాసన చూడకుండానే హాఫ్ సెంచరీ పూర్తి చేసేలా ఉన్నావ్ అంటూ రవితేజను హీరోయిన్లు ఆట పట్టించే మసాలా సంభాషణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయట. అందమైన భామలు తమన్నా, రాశి ఖన్నాలు బెంగాల్ టైగర్ రవితేజతో ఆడుకున్న మొరటైన సఫారి ఆటలు చూడాలంటే మరో వారం వేచి  చూడాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ