వయసుకు మించిన పరిణతితో రామ్ చరణ్ తమ అందరి మనసు గెలుచుకున్నాడని కోన వెంకట్ పదేపదే బ్రూస్ లీ ప్రమోషన్సులో చెబుతుంటే అయ్యో పాపం శ్రీను వైట్ల, కోన వెంకట్ ఒక్కటయ్యారులే, ఇక అంతా శుభమే అనుకున్నాం. బయటకు ఇంతలా కలరింగ్ ఇస్తున్నా, లోలోపల ఆ ఇద్దరూ ఈగోలతో ఇంకా రగిలిపోతున్నారని మెగా మాయలో పడి ఎవరూ గుర్తించలేకపోయారు. చిరంజీవి క్యామియో అనగానే వైట్ల, కోన వీర లెవెల్లో రఫ్ఫాడించి ఉంటారని అభిమానులు తలిస్తే బ్రూస్ లీ బొక్కబోర్లపడ్డ నాటి నుండి మళ్ళీ కోన-వైట్ల వైరం కొత్త రూపంలో బయటికి వచ్చింది. కోన అయితే ఏకంగా తాను రాసిన స్క్రిప్టు అసలు బ్రూస్ లీ కోసం వాడనే లేదన్నట్లుగా వాదించి పారేస్తుంటే, వైట్ల మాత్రం ఓన్లీ సైలెన్స్, నో వయోలెన్స్ అంటూ తన సినిమా డైలాగుల్లో ప్రాసలాగే మిన్నకుండిపోయాడు. మరి తాను కలిపిన జంట కదా, మళ్ళీ ఇలా విడిపోతున్నారు ఏంటబ్బా అన్న బాధ రామ్ చరణ్ గారిలో కూడా ఇసుమంతైనా కనబడటం లేదు. నా సినిమానే పోయాక, ఇక వీళ్ళు కలిసుంటే ఏంటి విడిపోయి కొట్టుకుంటే నాకేంటి అన్నట్లుగా ఉంది మెగా హీరో వ్యవహారం. వయసు, పరిణతి అని మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకోవడానికి భారీ పదాలు వాడిన కోన వెంకట్ గారు ఇప్పుడు ఏమంటారో, అంతా వట్టి బుస్సు...! నో ఎమోషన్స్, నో రిలేషన్స్... ఐ లవ్ ఓన్లీ ప్రమోషన్స్ అంటారేమో!