Advertisementt

ఇదేం తొడల యవ్వారం నాయనా

Wed 02nd Dec 2015 02:38 PM
sreedevi,sreedevi thighs,guns and thighs,rgv  ఇదేం తొడల యవ్వారం నాయనా
ఇదేం తొడల యవ్వారం నాయనా
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ నోట్లో నోరు పెడితే యవ్వారం కంపు కంపవుతుంది అనడానికి మరో మంచి ఉదాహరణ దొరికింది. ట్విట్టర్ ద్వారా గానీ, బయట రచనల్లో గానీ ఆయన చేసే కామెంట్స్ విని ఊరుకోవాలే తప్ప రీ-కామెంట్ చేస్తే రచ్చ రంబోల అవుద్దన్న విషయం పాపం శ్రీదేవి భర్త బోణీ కపూరుకు లేటుగా తెలిసొచ్చింది. గన్స్ అండ్ తైస్ పేరుతో వర్మ రాసిన ఓ పుస్తకంలో ఆయనకు శ్రీదేవి పట్ల ఎంతటి క్రష్ ఉండేదో మసాలా మాటల్లో తెలిపాడు. అది చదివిన బోణీ గాయపడ్డ మనసుతో వర్మ వ్యక్తిత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేసాడు. ఎంత కాదన్నా భర్త కదా, భార్యను పరాయి మగాడు ఓ మాటంటే ఊరుకుంటాడా. కానీ అక్కడున్నది వర్మ అన్న సంగతిని ఆగ్రహంలో గ్రహించలేకపోయాడు. మరి వర్మ ఊరుకుంటాడా. ఓ వైపు బోణీకి చురక అంటిస్తూనే మరో వైపు శ్రీదేవి తొడల మీద పెద్ద ప్రచారమే చేసాడు. శ్రీదేవి తొడల పట్ల తాను ఆకర్షితున్ని అయ్యానని, ఆమె హీరోయినుగా పేరు సంపాదించడానికి తొడలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తొడ రామాయణం వల్లించాడు. ఏది ఏమో గానీ, గూగులులో ఇప్పుడు మాత్రం శ్రీదేవి తొడల బొమ్మలకు ఎక్కువ సెర్చ్ వచ్చేస్తోంది.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ