Advertisementt

కమల్ కు మరో మ్యూజికల్ హిట్ ఇస్తాడా..!

Wed 02nd Dec 2015 02:00 PM
kamal hassan,ilayaraja,amala,amma nanna aata,rajeev  కమల్ కు మరో మ్యూజికల్ హిట్ ఇస్తాడా..!
కమల్ కు మరో మ్యూజికల్ హిట్ ఇస్తాడా..!
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌-ఇళయరాజా అంటే సూపర్‌హిట్‌ మ్యూజికల్‌ కాంబినేషన్‌. కమల్‌ నటించిన సగం చిత్రాలకు పైగా మ్యూజిక్‌ను ఇళయరాజానే అందించాడు. అయితే ఈ కాంబినేషన్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది. తాజాగా మరోసారి ఈ కలయిక కుదిరింది. మలయాళ దర్శకుడు టీకే రాజీవ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌-అమల జంటగా కలిసి 'అమ్మా నాన్న ఆట' పేరిట ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా బాణీలు అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని దాదాపు అమెరికాలోనే షూటింగ్‌ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి కమల్‌హాసన్‌తో కలిసి ఇళయరాజా పనిచేయడం సంగీత ప్రియులకే కాదు.. యావత్‌ ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా చెప్పుకోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ