Advertisementt

కన్‌ఫ్యూజ్‌ చేస్తోన్న కృష్ణంరాజు..!

Wed 02nd Dec 2015 01:15 PM
krishnam raju,prabhas,bahubali part2,gopikrishna movies,danda movie  కన్‌ఫ్యూజ్‌ చేస్తోన్న కృష్ణంరాజు..!
కన్‌ఫ్యూజ్‌ చేస్తోన్న కృష్ణంరాజు..!
Advertisement
Ads by CJ

ప్రభాస్‌ ప్రస్తుతం తన దృష్టిని మొత్తాన్ని 'బాహుబలి పార్ట్‌2'పై కేంద్రీకరించాడు. ఈ చిత్రం పూర్తయ్యే వరకు ఆయన మరో సినిమా చేసే అవకాశం లేదు. దాదాపు ఒక ఏడాదికి పైగా ఆయన 'బాహుబలి2'లో బిజీగా ఉంటాడు. అయితే ఈ చిత్రం తర్వాత ఆయన యువి క్రియేషన్స్‌ బేనర్‌లో సుజీత్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు తన డైరెక్షన్‌లో మొదటి సారి మెగాఫోన్‌ చేతబట్టి ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేయాలనే ఉత్సాహంలో ఉన్నాడు. ఇదే మాటను కృష్ణంరాజు ప్రభాస్‌ హీరోగా పరిచయం అయినరోజు నుండి చెబుతూనే ఉన్నాడు. మొదట 'విశాల నేత్రాలు' అనే నవలను తెరకెక్కిస్తానన్నాడు. ఆ తర్వాత 'ఒక్క అడుగు' అనే టైటిల్‌తో సినిమా చేయనున్నానని ప్రకటించాడు. తాజాగా ఆయన తన సొంత బేనర్‌ అయిన 'గోపీకృష్ణ మూవీస్‌' పతాకంపై ఓ చిత్రం చేయడం కోసం 'దందా' అనే టైటిల్‌ను రిజిష్టర్‌ చేయించాడు. మరి ఇన్నిసార్లు సినిమా త్వరలో.. సినిమా త్వరలో అని చెప్పుకుంటూ వెళ్తున్న కృష్ణంరాజు ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడు? అనేది మాత్రం కన్‌ఫ్యూజన్‌కు గురిచేస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ