Advertisementt

మెగాహీరో ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్..!

Wed 02nd Dec 2015 01:12 PM
  మెగాహీరో ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్..!
మెగాహీరో ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్..!
Advertisement
Ads by CJ

పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో మెగాహీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రం వరుణ్‌తేజ్‌కు మూడో చిత్రం. ఈ చిత్రాన్ని సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 8వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈ వేడుకకు యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడని సమాచారం. ఇక 'లోఫర్‌' చిత్రం పూర్తి కావడంతో యమా స్పీడుమీదుండే పూరీజగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రాన్ని ఎలాంటి హడావుడి లేకుండా బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరుపుతున్నాడు. ప్రస్తుతం అక్కడ కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా 'మహాత్మ' చిత్రాన్ని నిర్మించిన మనోహర్‌ కుమారుడు ఇషాన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీని కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు కాగా ఈ చిత్రం ద్వారా ఆయేషా శర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ