Advertisementt

దేవి కోసం కాదు ఈ ఫీల్ మై లవ్!

Tue 01st Dec 2015 04:24 PM
feel my love,varun tej,venki atluri,dil raju,devi sri prasad  దేవి కోసం కాదు ఈ ఫీల్ మై లవ్!
దేవి కోసం కాదు ఈ ఫీల్ మై లవ్!
Advertisement
Ads by CJ

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా మొదలవబోయే అతని కెరీర్ మొదటి చిత్రానికి దిల్ రాజు, సుకుమార్లు చక్కటి పునాది వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కుమారి 21 ఎఫ్ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ ముగ్గురు మరోసారి ఫీల్ మై లవ్ సినిమాతో కలవబోతున్నారు, అదీ దేవి హీరోగా అంటూ గత రెండు మూడు రోజులుగా పలు పుకార్లు షికార్లు కొట్టాయి. అసలు విషయానికి వస్తే ఫీల్ మై లవ్ అన్న టైటిల్ దిల్ రాజు గారు రిజిస్టర్ చేయించిన మాట నిజమే కాని, అది దేవి కోసం కాదు. మెగా కాంపౌండ్ వరుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ మీద మొదలవబోయే ఓ కొత్త  మూవీ కోసం ఈ పేరు పెట్టుకున్నారంట. వెంకీ అట్లూరి అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించబోయే ఈ ప్రాజెక్టు తదుపరి డీటెయిల్స్ తొందర్లోనే బయటికి రాబోతున్నాయి. స్నేహగీతం సినిమాతో హీరోగా పరిచయం అయిన వెంకీ అట్లూరి అటు తరువాత దర్శకత్వ శాఖలోకి ప్రవేశిం చి ఫీల్ మై లవ్ స్క్రిప్టుతో దిల్ రాజును మెప్పించాడు. లోఫర్ తరువాత అన్నీ కుదిరితే మొదలవబోయే వరుణ్ తేజ్ కొత్త సినిమా ఇదే కావొచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ