Advertisementt

వచ్చే వేసవికి ఆసక్తికర పోటీ..!

Tue 01st Dec 2015 12:55 PM
rajinikanth,kabali,mahesh babu,brahmothsawam,allu arjun,sarainodu  వచ్చే వేసవికి ఆసక్తికర పోటీ..!
వచ్చే వేసవికి ఆసక్తికర పోటీ..!
Advertisement
Ads by CJ

వచ్చే ఏడాది వేసవిలో బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికరమైన పోటీ జరుగబోతోంది. ముగ్గురు స్టార్‌ హీరోల మధ్య రసవత్తర పోటీ ఉండబోతోంది. ఈ ముగ్గురి సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్దం అవుతుండటం ఇందుకు కారణం. ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు. సౌత్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌. తమిళ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 14న కావడంతో రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'ని ఏప్రిల్‌ 10న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్‌ 8వ తేదీన మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్రహ్మొత్సవం' చిత్రం విడుదల తేదీని లాక్‌ చేశారు. మరోపక్క ఏప్రిల్‌ సెంటిమెంట్‌తో 'రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాలు మంచి విజయం సాదించిన నేపథ్యంలో తాను ప్రస్తుతం గీతాఆర్ట్స్‌ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'సరైనోడు' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని కూడా ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని బన్నీతో పాటు అల్లు అరవింద్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాడు. మరి వేసవి నాటికి వీటి విడుదలలో ఏమైనా మార్పులు ఉంటాయా? లేక ఇప్పుడు అనుకున్న సమయానికే విడుదల అవుతాయా? అన్నది వేచిచూడాల్సివుంది....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ