Advertisementt

'బాహుబలి2' విశేషాలు..!

Mon 30th Nov 2015 10:39 PM
bahubali part2 shooting,ramoji film city,rajamouli,prabhas  'బాహుబలి2' విశేషాలు..!
'బాహుబలి2' విశేషాలు..!
Advertisement
Ads by CJ

'బాహుబలి2' షూటింగ్‌ డిసెంబర్‌ 14నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదటి షెడ్యూల్‌తో మొదలుకానుంది. ఇది చాలా చిన్న షెడ్యూల్‌గా ఉంటుందిట. సంక్రాంతి పండగ తర్వాత లాంగ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పార్ట్‌2లో 80శాతం సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో, 20శాతం సినిమా షూటింగ్‌ ఇతర లొకేషన్లలో జరుగుతుంది. మొదటిభాగం షూటింగ్‌లోనే 40శాతం రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను కూడా చిత్రీకరించారు. అయితే ఆ 40శాతంలో ఓ 20శాతం మాత్రమే ఇప్పుడు ఉపయోగపడుతుందట. మిగిలిన 20శాతంను పక్కనపెట్టనున్నారు. సో.. రెండోపార్ట్‌కి సంబంధించిన 80శాతం షూటింగ్‌ బ్యాలెన్స్‌ను ఇప్పుడు చిత్రీకరించాల్సివుంది. 

రెండోపార్ట్‌లో కొత్తగా పరిచయం అయ్యే క్యారెక్టర్లు తక్కువే అని, మిగిలిన భాషా నటీనటులకు గెస్ట్‌రోల్స్‌కు మాత్రమే పరిమితం చేయాలనేది రాజమౌళి ప్లాన్‌ అంటున్నారు. కణన్‌ కన్నన్‌ టీమ్‌, ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌తో కలిసి బేసిక్‌ డిజైన్‌ వర్క్‌ అప్పుడే మొదలు పెట్టేశారు. మొదటి పార్ట్‌లో సినిమా చివరలో ఇంటర్నేషనల్‌ టీమ్‌ని రప్పించారు. ఈసారి ఆరంభం నుండి అంటే బేసిక్‌ డిజైన్‌ వర్క్‌ ఉంచి ఇంటర్నేషనల్‌ టీమ్‌ను ఎంగేజ్‌ చేశారు. 'బాహుబలి' కోసం రెండేళ్లు కష్టపడిన ప్రభాస్‌ ఈ సినిమా కోసం మిగిలిన సినిమాలన్నీ పక్కనపెట్టాడు. పెళ్లి కూడా వాయిదా వేసుకున్నాడు. 'బాహుబలి' పార్ట్‌ 1 విడుదల తర్వాత ప్రభాస్‌కి కాస్త రెస్ట్‌ దొరికింది. పార్టీలు, వేడుకలు అంటూ హంగామా చేశాడు. కుటుంబ సభ్యులుతో కొన్నిరోజులు ప్రశాంతంగా గడిపాడు. ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతున్నాడు. పార్టీ మూడ్‌ నుంచి బయటకు వచ్చి కసరత్తులు మొదలుపెట్టాడు. డిసెంబర్‌14న 'బాహుబలి పార్ట్‌2' సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకోసం ప్రభాస్‌ సన్నద్దుడు అవుతున్నాడు. రెండు నెలల నుంచి జిమ్‌కి దూరంగా గడిపిన ప్రభాస్‌ మరలా జిమ్‌లో కసరత్తులు చేస్తూ, కండలు పెంచుతున్నాడు. మరో 15రోజుల్లో బాడీని ఫిట్‌ చేయాలని ప్రభాస్‌ టార్గెట్‌గా పెట్టుకొన్నాడట. తన డైట్‌ని ఇప్పుడిప్పుడే మార్చుకొంటున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్‌ 'బాహుబలి2' మూడ్‌లోకి వెళ్లిపోయాడన్న మాట..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ