కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాంత సునీల్ ప్రయాణం అనుకున్న స్థాయిలో సాగడం లేదనేది వాస్తవం. ఈమద్యకాలంలో సునీల్ సినిమా థియేటర్లలో కనబడి చాలాకాలం అయింది. మరి కొన్ని రోజులైతే సునీల్‌ను అంతా మరిచిపోతారని అనుకుంటున్న తరుణంలో డిసెంబర్‌లో ఆయన నటించిన 'కృష్ణాష్టమి' సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రైటర్ గోపీమోహన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయాల్సివుంది. సునీల్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోవడంతో అనుకున్న సమయానికి ఈ మూవీ మొదలుకాలేదు. దీంతో గోపీమోహన్ తన నిర్ణయం మార్చుకొని వేరే హీరోతో అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఇటీవల నాని హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాదించి... నానిని స్టార్‌ను చేసిన మారుతి మూవీ 'భలేభలే మగాడివోయ్' చిత్రం చేయమని మొదట మారుతి సునీల్‌ను కలిశాడట. చాలారోజులు నాన్చి నాన్చి ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఈచిత్రం చివరకు గీతాఆర్ట్స్ వద్దకు చేరి నాని చేతికి చిక్కింది. మరి గోపీమోహన్ చిత్రం విషయంలో కూడా సునీల్ అదే పొరపాటు చేస్తున్నాడేమో అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.