దర్శకుడిగా ఓంకార్ మొదటి మెట్టు మీదే జీనియసుగా తడబడ్డాడు. కానీ తొందరగానే తేరుకుని రాజు గారి గదిలోని బంగారు నిధినే దోచుకుపోయాడు. సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్రం వారి అండదండలు లేకపోతే రాజు గారి గది ఇంతటి ఘన విజయం సాధించడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఈ చిత్రానికి గాను ఓంకారుకు ఎంత లాభం ముట్టిందో తెలియదు గానీ సాయిగారికి మాత్రం ఓంకారు మీద బ్రహ్మాండమైన అభిప్రాయం ఏర్పడింది. అందుకేనేమో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, విజయవాడ పిల్ల తేజస్విని మదివాడ హీరోయినుగా ఓంకార్ నిర్మాణ సంస్థ ఓక్ బ్యానర్ మీద రూపొందిన జత కలిసే పంపిణీ హక్కులు కూడా సాయిగారు తీసుకున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కేవలం కోటిన్నర ఖర్చు లోపలే ఈ సినిమా పూర్తి నిర్మాణం జరిగిపోవడంతో సాయిగారు మరోసారి ఓంకార్ అన్నయ్యకు గోల్డెన్ చాన్స్ ఇచ్చి ప్రమోషన్ నుండి రిలీజ్ వరకు అన్ని బాధ్యతలు తానే తీసుకున్నాడని తెలుస్తోంది.