సినిమా పట్ల ఎనలేని ప్యాషన్ ఉన్న దర్శకుల్లో గుణశేఖర్ పేరు ప్రప్రథమంగా చెప్పుకోవాలి. వరసగా ఓటములు ఎదురవుతున్నా తను నమ్మిన సిద్దాంతాన్ని వదలకుండా ఇంటిలో భార్య, పిల్లల బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ ఎంతగానో కలలుగన్న రుద్రమదేవి అనే చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ చిత్రంతో ఆర్థికంగా ఎంతో కొంత పోగొట్టుకున్నా, సినిమా పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ పట్ల మరోసారి అందరిలోనూ స్ఫూర్తిని నింపాడు. అదే స్ఫూర్తితో దిల్ రాజు నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో గోన గన్నారెడ్డి సినిమా ప్రాణం పోసుకోవడానికి ఎంతగానో తపన పడుతోంది. రుద్రమదేవి చివరి అంకంలో ప్రతాపరుద్ర కథని రెండో పార్టుగా తీస్తానని గుణ ప్రకటించినా, అది ఇప్పట్లో జరిగేలా లేదు. దాని స్థానే గోనగన్నారెడ్డి కథతో మరింత విస్తారంగా కథనం తయారు చేసి ఓ స్టార్ హీరోతో మరో హిస్టారికల్ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి దిల్ రాజు అనుమతి కోరాడు గుణశేఖర్. అన్నీ సవ్యంగా సాగితే గుణశేఖర్ తదుపరి మూవీ ఇదే అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.