Advertisementt

దేవి లవ్వును ఫీలయ్యేది ఎవరబ్బా?

Mon 30th Nov 2015 03:28 PM
devi sri prasad,feel my love,dil raju,sukumar  దేవి లవ్వును ఫీలయ్యేది ఎవరబ్బా?
దేవి లవ్వును ఫీలయ్యేది ఎవరబ్బా?
Advertisement
Ads by CJ

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఆరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. సంగీత దర్శకుడిగా తెలుగు సినిమా సంగీతాన్ని కొత్త మలుపు తిప్పిన దేవి ఇప్పుడు హీరోగా రాబోతున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉన్నా, నిర్మాతగా దిల్ రాజు, దర్శకుడిగా సుకుమార్ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురి కలయిక సూపర్ హిట్టని ముందే అనేసుకోవచ్చు. దేవి సినిమా కోసం దిల్ రాజు ఆల్రెడీ సుకుమార్ చెప్పిన ఓ ప్రేమకథను వినేసాడని, తెగ నచ్చేసి అందుకు అనుగుణంగా ఫీల్ మై లవ్ అనే టైటిల్ కూడా ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఆర్య సినిమాకు గాను అల్లు అర్జున్ కోసం దేవి ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ సూపర్ హిట్ పాటలోని సాహిత్యంలో ఫీల్ మై లవ్ అనే లైన్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలియనిది కాదు. సుక్కు చెప్పే ప్రేమ కథల్లో ఎంతటి ఫీల్ ఉంటుందో, దేవి స్వరపరిచే పాటల్లో కూడా అంతే ఫీల్ ఉంటుంది. అందుకే అందరి ఫీలింగ్స్ సరైన మోతాదులో కలిసేలా దిల్ రాజు ఫీల్ మై లవ్ అన్న పేరు నమోదు చేసారు. మరి దేవి ప్రేమను ఫీల్ చేయబోయే ఆ హీరోయిన్ ఎవరయి ఉంటారబ్బా... 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ