Advertisementt

మరో ఆర్యా తీస్తారా?

Sat 28th Nov 2015 03:57 PM
devi sri prasad,sukumar,dil raju  మరో ఆర్యా తీస్తారా?
మరో ఆర్యా తీస్తారా?
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా సంగీత సముద్రంలో ఉత్తుంగ తరంగంలా ఎగిసిన దేవి శ్రీ ప్రసాద్ మూడు నాలుగేళ్ల కిందే హీరోగా అవతారం ఎత్తేసేవాడు. అప్పుడెప్పుడో చార్మీ హీరోయినుగా దేవి హీరోగా సినిమా మొదలవుతుంది అని ప్రచారం కూడా సాగింది కానీ మ్యూజిక్ డైరెక్టరుగా బాగా బిజీ అయిపోయిన దేవి అందుకు సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉండిపోయాడు. కుమారి 21 ఎఫ్ సినిమా విజయోత్సవ వేడుకలో నిర్మాత  దిల్ రాజు, దర్శకుడు సుకుమార్ తమ మనసులోని మాటను బయటేసి దేవిని హీరోగా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దేవి స్టామినా అండ్ ఎనర్జీ గురించి తెలిసిన వారందరూ అతను హీరోగా ఈజీగా రాణిస్తాడని, నటన పై కొంచెం శ్రద్ధ పెడితే మన కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ ఇవ్వగలడని గట్టి విశ్వాసంతో చెబుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్యలాంటి కథ మరోటి సుకుమార్ తయారు చేస్తున్నాడని కూడా తాజాగా ప్రచారం సాగుతోంది. ఇంకేముంది గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, గీత రచయితగా సక్సెస్ అయిన దేవి ఇక నుండి హీరోగా కూడా ఇరగదీస్తాడు అన్న మాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ