Advertisementt

మహేష్ తిరిగి ఇచ్చేసాడంట!

Sat 28th Nov 2015 11:51 AM
mahesh babu,ashwani dutt,harika and hasini creations,10crores advance  మహేష్ తిరిగి ఇచ్చేసాడంట!
మహేష్ తిరిగి ఇచ్చేసాడంట!
Advertisement
Ads by CJ

ఫామ్‌లో ఉన్న స్టార్‌ హీరోలకు ఎంత క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌ వంటి స్టార్స్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు పోటీపడుతుంటారు. కొందరు నిర్మాతలైతే సినిమా కమిట్‌మెంట్‌కు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చి స్టార్‌ హీరోల డేట్స్‌ దక్కించుకుంటారు. గతంలో భారీ నిర్మాత అశ్వనీదత్‌ ఇదే తరహాలో అడ్వాన్స్‌ ఇచ్చి డేట్స్‌ తీసుకున్నాడు, కానీ మహేష్‌ ఇతర సినిమాలతో బిజీ కావడం, మంచి కథను అశ్వనీదత్‌ తీసుకురాలేకపోవడంతో ఆయన అడ్వాన్స్‌ను మహేష్‌ తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఇక హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత, నిర్మాత రాధాకృష్ణ కూడా త్రివిక్రమ్‌తో కలిసి మహేష్‌బాబుతో ఓ సినిమా చేయదలచి ఆయనకు అడ్వాన్స్‌గా 10కోట్లు ఇచ్చాడని తెలుస్తోంది. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో మహేష్‌బాబు హామీ ఇవ్వకపోవడంతో రాధాకృష్ణ ప్రస్తుతానికి తన అడ్వాన్స్‌ను తిరిగి వెనక్కి తీసేసుకున్నాడని టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ