Advertisementt

త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో కన్ఫర్మ్..!

Sat 28th Nov 2015 11:18 AM
trivikram srinivas,surya,harika and hasini creations,a aa movie  త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో కన్ఫర్మ్..!
త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో కన్ఫర్మ్..!
Advertisement
Ads by CJ

చాలామంది పరభాషా హీరోలు తమ చిత్రాలు తెలుగులో డబ్బింగ్‌ చేసే సమయంలో తాము తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా చిత్రాలు చేస్తామని చెబుతుంటారు. ఇక ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ మాటే ఎత్తరు. ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందరో హీరోలు తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాలు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పారు. కానీ తమిళస్టార్‌ హీరో సూర్య మాత్రం తను అన్న మాటను నిలబెట్టుకుంటున్నాడు. ఆయన చాలా రోజుల కిందట తెలుగులో ఓ స్ట్రెయిట్‌ చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడంలో బిజీగా ఉన్నాడు. త్వరలో ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెలుగులో నటించనున్నాడు. తాము కేవలం హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తోనే చిత్రం చేస్తామని ప్రకటించిన నిర్మాత రాధాకృష్ణ తన మాటకు కట్టుబడుతూ సూర్య -త్రివిక్రమ్‌ల సినిమాను ప్రొడ్యూస్‌ చేయనున్నాడు. కాగా త్రివిక్రమ్‌ ప్రస్తుతం నితిన్‌తో 'అ..ఆ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఫిబ్రవరి నుండి ఫ్రీ అవుతాడు. కానీ సూర్య పరిస్థితి వేరేగా ఉంది. ఆయన తన ప్రాజెక్ట్‌తో సెప్టెంబర్‌ వరకు బిజీ అంట. దాంతో సూర్య సినిమా కోసం అన్ని నెలలు తాను ఖాళీగా ఉండలేనని సూర్యకు చెప్పడంతో త్రివిక్రమ్‌ సినిమాను మిస్‌ చేసుకోకూడదని భావిస్తున్న సూర్య తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌లో ఏదో ఒక సినిమాను పోస్ట్‌పోన్‌ చేసి త్రివిక్రమ్‌ సినిమా చేయాలనే ఆలోచనలో సూర్య ఉన్నాడని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాదాకృష్ణ ఇప్పటికే నితిన్‌తో, నాగచైతన్యతో, విక్టరీ వెంకటేష్‌తో.. ఇలా మూడు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే ఆయన ఆర్థికంగా మూడు చిత్రాలకు బడ్జెట్‌ కేటాయించేందుకే మహేష్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కి తీసుకున్నాడని వినపడుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ