నితిన్ నిర్మాతగా ఎన్నో అంచనాలతో అక్కినేని అఖిల్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ భారీ బడ్జెట్‌తో తీసిన 'అఖిల్' చిత్రం డిజాస్టర్ కావడంతో ఆయనకు దాదాపు 20కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీని రికవరీ కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు నితిన్‌పై భారీస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట. కానీ ఇప్పటికే నాగార్జున ఆయా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని రికవరీ దిశగా తమ అక్కినేని కుటుంబ చిత్రాలను రీజనబుల్ రేట్లకే ఇచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చినప్పటికీ కొందరు నుండి మాత్రం నితిన్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తూనే ఉంది. దాంతో డైరెక్టర్ వినాయక్ ముందుకు వచ్చి తన రెమ్యూనరేషన్ 10కోట్లలో సగం మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తానని, నితిన్‌కు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చాడట. ఇక హీరో అఖిల్ సైతం మరో ఐదు కోట్లు తనవంతుగా డిస్ట్రిబ్యూటర్లకు రికవరీలో భాగంగా ఇస్తానని ముందుకు రావడంతో మొత్తం 10కోట్ల వరకు నితిన్‌కు ఊరట కలిగింది. మిగిలిన 10కోట్లను తానేభరిస్తానని నితిన్ సైతం ముందుకు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు కామ్ అయ్యారని, లేకపోతే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ధర్నాలు ,గొడవలు చేసి నితిన్‌ను నానా భ్రష్ణు పట్టించే వారని, అయినా వ్యాపారం అన్న తర్వాత లాభనష్టాలు ఉంటాయని తెలిసి, ఎవ్వరి ఒత్తిడి లేకుండా తామే ఎక్కువ మొత్తాలు చెల్లించి హక్కులు పొందినప్పుడు ఇలా చేయడం సమంజసం కాదని కొందరు అంటున్నారు. కాగా ఇప్పటివరకు తమిళంలో సూర్య హీరోగా, 'మనం' దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '24' చిత్రాన్ని మంచి రేటుకు తెలుగు హక్కులు తీసుకోవాలని నితిన్ భావించిన సంగతి తెలిసిందే. 'ఇష్క్' చిత్రంతో తన కెరీర్‌ను గాడిలో పెట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ చేస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్రం టాలీవుడ్ హక్కులు కొనుగోలు చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు తాను ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ చిత్రం హక్కులు తీసుకునే పరిస్థితుల్లో లేనని సూర్య, విక్రమ్‌కుమార్‌లకు చెప్పినప్పటికీ... మరీ అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాము ఈ చిత్రాన్ని అందరిలా కాకుండా తక్కువ ధరకే ఇస్తామని సూర్య, విక్రమ్‌కుమార్‌లు మాట ఇచ్చారని సమాచారం.