Advertisementt

మరో ఇంటివాడైన మహేష్‌..!

Fri 27th Nov 2015 04:54 PM
mahesh babu,new house,mombay,namratha sirodhkar  మరో ఇంటివాడైన మహేష్‌..!
మరో ఇంటివాడైన మహేష్‌..!
Advertisement
Ads by CJ

'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌ రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. ఆయన ఉత్సాహంతో దర్శకుడు కొరటాల శివకు, తన కుమారుడు గౌతమ్‌కృష్ణలకే కాకుండా తాను కూడా రేంజి రోవర్‌ కారు కొనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఓ ఖరీదైన లొకాలిటీలో ఫ్లాట్‌ కొన్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఆయన ఆ ఫ్లాట్‌ కొన్నది ముంబైలోని సబర్బన్‌ ఏరియాలో. ఆ ఫ్లాట్‌ ఖరీదు 25కోట్లు అని తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్‌ అతని స్నేహితులు వేసిన వెంచర్‌లోనే ఈ ఫ్లాట్‌ ఉంది. ఈమధ్య ఈ ఫ్లాట్‌ విషయం కోసం మహేష్‌ -నమ్రతలు ముంబై వెళ్లి ఆ ఫ్లాట్‌కు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి చేసుకొని వచ్చారు. అయితే ఈ 25కోట్లు తను తర్వాత చేయబోయే చిత్రాల కోసం ఇద్దరు ప్రొడ్యూసర్స్‌ వద్ద అడ్వాన్స్‌గా తీసుకున్న మొత్తం అని తెలుస్తోంది. ముంబై వెళ్లినప్పుడు ఈ ఫ్లాట్‌ ఉపయోగిస్తారట. అలాగే తమ కుటుంబ సభ్యులు ఎవరైనా ముంబై వెళితే, హోటల్‌లో దిగకుండా ఈ ఫ్లాట్‌లోనే దిగవచ్చుననే ఉద్దేశ్యంతోనే అంత రేటు పెట్టి దాన్ని కొనుగోలు చేశారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ