Advertisementt

అందమైన బండావతారానికి ఫలితం దక్కాలి!

Fri 27th Nov 2015 02:48 PM
anushka,size zero,bahubali  అందమైన బండావతారానికి ఫలితం దక్కాలి!
అందమైన బండావతారానికి ఫలితం దక్కాలి!
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలకు ధీటుగా ఎవరైనా హీరోయిన్ తన స్థానాన్ని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరం చేసుకుందా అంటే ఈ జనరేషన్లో అది తప్పకుండా అనుష్క మాత్రమే. కథానాయికగా ఓ వైపు గ్లామరసం పంచుతూనే మరో వైపు తనకంటూ ఓ స్పెషల్ ఇమేజిని సొంతం చేసుకునే క్రమంలో వచ్చిన అరుంధతి, వర్ణ, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు అనుష్క పనితనానికి గీటురాళ్ళుగా నిలిచాయి. అదే కోవలో రాబోతున్న మరో హీరోయిన్ ప్రధాన కథాంశంతో రూపొందిన సినిమా సైజు జీరో. నిజానికి బాహుబలికి పడ్డ కష్టంతో ఏ హీరోయిన్ అయినా ఎంచక్కా నాలుగు పాటలు, హీరో పక్కన అయిదు స్టెప్పులు... అలా అలా కాయాకష్టం తెలియకుండా సాగిపోయే ప్రాముఖ్యతలేని, శ్రమలేని పాత్రను ఎంచుకుని కాసింత గ్యాప్ తీసుకునేవారే. కానీ ఈ పని రాక్షసి మాత్రం తగుదునమ్మా అంటూ సైజు జీరో కోసం తొంభై కిలోల వరకు బరువు పెంచుకుని బాహుబలిని మించిన శారీరక శ్రమను ఆనందంగా ఆస్వాదించింది. కథానుగుణంగా ఏదో రకంగా మేకప్పు వేసి బండి లాగించేయోచ్చు కానీ అనుష్క మాత్రం అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా స్వీట్లు, హాట్లు లాగించి బండావతారం ఎత్తింది. రేపు రాబోయే సైజు జీరో సక్సెస్ అయితే ఇంతటి శ్రమకు సరైన గుర్తింపు లభించినట్టే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ