మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇటీవల షాకింగ్ సంఘటన జరిగిందట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులు తప్పతాగి ఆయన కారును వెంబడిస్తూ.. వేధింపులు చేసినట్లు తెలుస్తోంది, ఇటీవల ఏదో పని మీద చిరు బంజారా హిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోల్‌కు వెళ్లాడట. తిరిగి వస్తుండగా తప్పతాగిన కొందరు యువకులు ఆయన కారును వెంబడిస్తూ వేధించారు. తాజ్‌కృష్ణ హోటల్ నుండి చిరంజీవి బ్లడ్‌బ్యాంకు వరకు వారు చిరు కారును వెంబడించారు. చిరు తన వెంట ఉన్న సెక్యూరిటీకి వారి గురించిన వివరాలు సేకరించాలని ఆదేశించారని సమాచారం. వారు చిరు అభిమానులా? లేక వేరే ఫ్యాన్స్‌కు చెందిన దుండగులా? అనే కోణంలో చిరు సమాచారం సేకరిస్తున్నాడు. మరి చిరు వాళ్లపైన పోలీసులకు కంప్లైంట్ చేస్తారా? లేక వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తారా? అనేది త్వరలో తేలనుంది.