Advertisementt

అమితాబ్ షాకింగ్ న్యూస్..!

Thu 26th Nov 2015 05:11 PM
amitabh bacchan,health issues,liver problem,hepatitis b virus  అమితాబ్ షాకింగ్ న్యూస్..!
అమితాబ్ షాకింగ్ న్యూస్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ షాకింగ్‌ విషయం ఒకటి బయటపెట్టాడు. బిగ్‌బి తరుచుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం, మళ్లీ వెంటనే కోలుకుంటూ ఉండం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు సీరియస్‌ అనారోగ్యం ఏమీ లేదని అభిమానులు భావిస్తూ వచ్చారు. తాజాగా అమితాబ్‌ ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. తనకు హెపటైటిస్‌ బి వైరస్‌ సోకిందని, దానివల్ల దాదాపు 75శాతం లివర్‌ పాడైపోయిందని కేవలం 25శాతం లివర్‌ మాత్రమే ఆరోగ్యంగా ఉందని చెప్పాడు. 1983లో 'కూలీ' సినిమా షూటింగ్‌లో అమితాబ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు దాదాపు 200మంది రక్తం ఇచ్చారు. దాదాపు 60బాటిళ్ల రక్తాన్ని అమితాబ్‌కు ఎక్కించారు. అందులోని ఒకరి రక్తం నుండి హెపటైటిస్‌ బి వచ్చిందని అనుమానిస్తున్నారు. దీన్ని అమితాబ్‌ సైతం అంగీకరిస్తు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ వయసులో ఇంత అనారోగ్యంలో కూడా ఆయన తనకు నచ్చిన సినిమాలు చేస్తూ అభిమానులను అలరించడం చూస్తుంటే ఎవరికైనా ఆయన కమిట్‌మెంట్‌పై, సినిమాలపై ఆయనకున్న ప్రేమ చూస్తే ముచ్చటేయకమానదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ