బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదల చేశాడు. మిగిలిన హీరోలు కూడా ఏడాదికి రెండు చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా టాలీవుడ్‌లో ఓ స్టార్‌హీరో సినిమా చేసి విడుదల చేయడానికే ఏడాది సమయం తీసుకొంటున్నారు. అలాంటిది తమిళ యంగ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఈ ఏడాదిలో మూడో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ధనుష్ సినిమా విడుదల అవుతుందంటే తమిళ నాట ఆ క్రేజే వేరు. అభిమానులకు నచ్చే అంశాలను అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. అలాగే తనదైన డైలాగులు, స్టెప్పులు, ఫైట్ సీన్స్, కామెడీ సీన్స్ వంటివి ప్రత్యేకంగా ఉండేలా ఆయన డిజైన్ చేసుకుంటాడు. తాజాగా ఆయన నటించే కొత్త చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాతో ఈ ఏడాది దనుష్ మూడు సినిమాల హీరో అవుతాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'అనేగన్'(అనేకుడు) చిత్రం వచ్చింది. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం విభిన్నతను కోరుకునే వారిని, ఆయన అభిమానులను అలరించింది. అనంతరం బాలాజీమోహన్ దర్శకత్వంలో 'మారి' సినిమా విడుదలైంది, ఇప్పడు వేల్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన 'తంగమగన్' చిత్రం వచ్చే నెల అంటే డిసెంబర్ 18న విడుదలకు సిద్దమవుతోంది. గతంలో ధనుష్, వేల్‌రాజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'విఐపి' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో కూడా 'రఘువరన్ బి.టెక్'గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అందుకు సీక్వెల్‌గా 'తంగమగన్' రూపొందుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.