Advertisementt

దేవిశ్రీ నీకు అవసరమా..?

Thu 26th Nov 2015 04:44 PM
devisriprasad,music director,will he become a hero,dil raju production,allu aravind  దేవిశ్రీ నీకు అవసరమా..?
దేవిశ్రీ నీకు అవసరమా..?
Advertisement
Ads by CJ

సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ మనసు మారుతోంది. ఆయనకు వరుసగా పలు పెద్ద నిర్మాతల నుండి హీరోగా నటించమని ఒత్తిడి వస్తోందిట. వాస్తవానికి దేవిశ్రీలో ఓ మ్యూజిక్‌డైరెక్టర్‌, సింగర్‌, డ్యాన్సర్‌, లిరిక్‌రైటర్‌ వంటి కోణాలెన్నో ఉన్నాయి. టోటల్‌గా ఆయనకు రాక్‌స్టార్‌కు కావాల్సినన్ని లక్షణాలు పుష్కళంగా ఉన్నాయి. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు యాక్టింగ్‌వైపుకు మళ్లుతోంది. ఆల్‌రెడీ '100%లవ్‌' చిత్రంలో హీరోగా అవకాశం వచ్చిందని, కానీ తనకు ఆ పాత్ర సూట్‌ కాదని వదిలేస్తే అది నాగచైతన్య వద్దకు వెళ్లిందని ఆయన స్వయంగా తెలిపాడు. దేవిశ్రీ హీరోగా నటిస్తానంటే గీతాఆర్స్‌ నుండి దిల్‌రాజు, జ్ఞానవేల్‌రాజా.. వరకు అందరూ అవకాశం ఇస్తామంటూ తనను హీరోగా చేయమని ఫోర్స్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఒక రంగంలో కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రస్థాయికి ఎదిగిన వారికి ఇతర రంగాలపై కన్నుపడుతుంది. కానీ దేవిశ్రీ పరిస్థితి అదికాదు. ఆయన సంగీతపరంగా పతాకస్థాయిని ఇంకా చేరుకోలేదు. ఆయనకు ఉన్న అభిమానులు కూడా ఆయనకు కేవలం సంగీత పరంగానే ఉన్నారు. టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు ఆయనకు క్రేజ్‌ ఉంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చివరకు సల్మాన్‌ఖాన్‌ వంటి సూపర్‌స్టార్‌ కూడా ఆయన అభిమానే. కానీ నటునిగా కాదు. ఆయనకు కళ్లెదుటనే ఆర్‌.పి.పట్నాయక్‌ వంటి వారు ఉదాహరణగా నిలుస్తారు. తమిళంలో జి.వి.ప్రకాష్‌ వంటి వారు హీరోలుగా హిట్టు కొడుతూ ఉండటం దేవిశ్రీని పురిగొల్పుతుందేమో తెలీదు కానీ అవి కూడా సినిమా కథా బలంతో వచ్చిన హిట్స్‌ మాత్రమే గానీ నటునిగా ప్రకాష్‌కు ఉన్న క్రేజ్‌ కారణం కాదని అర్థం చేసుకోవాలి. ఇక దేవిశ్రీ విషయానికి వస్తే ఆయనను హీరోగా పరిచయం చేయడానికి ప్రముఖులు సిద్దంగా ఉన్నప్పటికీ ఆయన ఆ వైపు అడుగు వేయకుండా ఉండటమే మంచిది. కానీ దేవి మాత్రం హీరోగా నటించడం ఖాయం..కానీ ఎప్పుడో చెప్పలేను.. అంటుండటం చూస్తుంటే ఈ యంగ్‌ తరంగ్‌కు నటనపై పూర్తిగా కోరిక పుట్టిందని భావించకతప్పదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ