Advertisementt

టాలీవుడ్ హీరోలకు కష్ట కాలం..!

Thu 26th Nov 2015 04:39 PM
ram charan tej,brucelee,akhil akkineni,akhil movie,nagachaitanya,ravi teja,bengal tiger  టాలీవుడ్ హీరోలకు కష్ట కాలం..!
టాలీవుడ్ హీరోలకు కష్ట కాలం..!
Advertisement

పాతకాలంలో ఓ స్టార్‌కు వరుసగా రెండు మూడు ఫ్లాప్‌లు ఎదురైనా వాళ్ల స్థానానికి వచ్చే ముప్పు పెద్దగా ఏమీ ఉండేది కాదు. కానీ నేటి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఒకటి, రెండు ఫ్లాప్‌లొస్తే చాలు వారి స్థానానికి, కలెక్షన్లకు, బిజినెస్‌కు... ఇలా అన్నింటికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పోటీ తీవ్రతరం అయింది. మరి ఇలాంటి పరిస్థితిలో కొందరు హీరోలు ఒకటిరెండు ఫ్లాప్‌ల తర్వాత తదుపరి చిత్రాలపై దాని ఫలితాలు ఆధారపడి ఉండటంతో ఎలాగైనా ఓ సూపర్‌హిట్‌ను, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తప్పక ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషమ పరిస్థితినే రామ్‌చరణ్‌ నుండి అల్లరినరేష్‌ వరకు ఎదుర్కొంటున్నారు. నిన్నటివరకు యంగ్‌స్టార్స్‌ పోటీలో బలంగా ఉన్న రామ్‌చరణ్‌ 'గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ' చిత్రాలు డిజప్పాయింట్‌ చేయడంతో దిక్కుతోచని పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. గెలుపు కోసం ఆయన పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా రెండు సినిమాలు నష్టాలను మిగల్చడం, కేవలం మాస్‌ ప్రేక్షకులనే తప్ప తన కోరిక అయిన ఫ్యామిలీ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో వరుస వైఫల్యాలతో రామ్‌చరణ్‌ నేడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఈ ప్రభావం ఆయన తదుపరి చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడింది. దీంతో తమిళ రీమేక్‌ అయిన 'తని ఒరువన్‌' రీమేక్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

అతనికి ఇతర స్టార్స్‌ నుండే కాదు... తన ఫ్యామిలీకి చెందిన అల్లుఅర్జున్‌ వైపు నుండి కూడా తీవ్రమైన పోటీ ఏర్పడుతోంది. వరుసగా 'రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి'లతో 50కోట్లను దాటిన హ్యాట్రిక్‌ హీరోగా రామ్‌చరణ్‌కు బన్నీ నుండి కూడా తీవ్రమైన పోటీ ఏర్పడుతోంది. ఇక అక్కినేని అఖిల్‌ విషయానికి వస్తే తన తొలిచిత్రం 'అఖిల్‌' తీవ్రంగా నిరాశపడటంతో ఒకే ఒక్క సినిమాతోనే అతనికి ఇబ్బంది ఎదురవుతోంది. రామ్‌చరణ్‌కు 'మగధీర'లాగా, బన్నీకి 'ఆర్య'లాగా, జూనియర్‌ ఎన్టీఆర్‌కు 'ఆది'లాగా ఇప్పుడు అఖిల్‌కు అర్జంట్‌గా ఓ బ్లాక్‌బస్టర్‌ అవసరం. తన రెండో చిత్రంతో దాన్ని దాటాలని ఈ కుర్రహీరో భావిస్తున్నాడు. దీంతో అఖిల్‌కు రెండో చిత్రమే డూ ఆర్‌ డై పరస్థితి ఏర్పడింది. ఇక 'కిక్‌2' డిజాస్టర్‌తో రవితేజ మార్కెట్‌ దారుణంగా పడిపోయింది. దీన్ని అధిగమించాలంటే ఆయన 'బెంగాల్‌టైగర్‌'తో సూపర్‌హిట్‌ కొట్టడం తప్పని స్థితిగా మారింది. అల్లరి నరేష్‌కైతే మూడునాలుగేళ్లుగా సరైన హిట్‌లేదు. 'సుడిగాడు' తర్వాత ఈయనకు మరలా హిట్‌ లేకపోవడంతో ఈయన సినిమాలకు బిజినెస్‌లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే పరిస్థితి నాగచైతన్యకు కూడా ఉంది. 'మనం, తడాఖా' సోలో హిట్స్‌ కాదు కాబట్టి ఆ చిత్రాలను పక్కనపెడితే, ఇక ఆయనకు గడ్డుపరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో ఆయన తనకు తొలిహిట్‌ ఇచ్చిన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రానున్న 'సాహసం శ్వాసగా సాగిపో'. 'ప్రేమమ్‌' రీమేక్‌లపై భారీ నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. ఇక ఇదే పరిస్థితిలో రామ్‌, గోపీచంద్‌, సునీల్‌ వంటివారు కూడా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి వీరి రాబోయే చిత్రాలైనా వీరికి ఊరటనిస్తాయో.. లేదో వేచిచూడాల్సిందే...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement