తన తొలి చిత్రం 'అఖిల్'తో అందరినీ నిరాశపరిచిన అక్కినేని అఖిల్ తన బాడీని మొదటి చిత్రంలోనే చూపించాలని భావించాడట. కానీ మొదటి సినిమాకే సిక్స్‌ప్యాక్ అంటే కొంత అతిగా ఉంటుందని భావించి వద్దనుకున్నాడు. కానీ ఆయన తన రెండో చిత్రంలో మాత్రం ఖచ్చితంగా చొక్కా విప్పి తన సిక్స్‌ప్యాక్‌ను చూపించాలని డిసైడ్ అయ్యాడట. మాస్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకోవాలంటే సిక్స్‌ప్యాక్ తప్పనిసరి అని ఈ కుర్రహీరో భావిస్తున్నాడని సమాచారం. 'అఖిల్' విడుదల తర్వాత పాపం.. ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లి వచ్చిన ఈ హీరో రెండో చిత్రం కథ ఏమైనా, దర్శకుడు ఎవరైనా సరే ఓ సీన్‌లో మాత్రం సిక్స్‌ప్యాక్ చూపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దానికి తగ్గట్లే ఆయన గోవా నుండి వచ్చిన తర్వాత తన మానాన తాను బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టి సిక్స్‌ప్యాక్‌ను ట్రై చేస్తున్నట్లు సమాచారం. 'అఖిల్' మిగిల్చిన అవమానంతో ఈ హీరో ఇప్పుడు ఎవ్వరినీ కలవడం లేదని, తనను కలవాలని భావిస్తున్న వారితో కూడా ముక్తసరిగా మాట్లాడుతున్నాడని, మరీ ఇంత సెన్సిటివ్ అయితే టాలీవుడ్‌లో నిలబడటం కష్టమని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.