విభిన్న కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యంగ్ హీరో నిఖిల్ త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. కాగా ఆయన నటించిన 'శంకరాభరణం' డిసెంబర్ 4న విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలైనే వెంటనే నిఖిల్ తన తాజా చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కాస్టింగ్ జరుగుతోంది. సందీప్ కిషన్‌తో 'టైగర్' చిత్రం తీసిన ఆనంద్‌తో ఈ చిత్రాన్ని నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నిఖిల్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా తాప్సి నటించనుండగా, మరో హీరోయిన్‌గా అవికాగోర్ నటించనుంది. మూడో హీరోయిన్‌గా నటించమని ప్రస్తుతం కలర్స్ స్వాతిని అడుగుతున్నారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 2వ వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి ఈ చిత్రంతో నిఖిల్ ఏ సంచనాలను సృష్టిస్తాడో వేచిచూడాల్సివుంది..!