మెగాబ్రదర్ నాగబాబు తనయుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన మెగాహీరో వరుణ్‌తేజ్ తన మొదటి చిత్రం 'ముకుందా'తో ఫర్వాలేదనిపించుకున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఆయన రెండో చిత్రం 'కంచె'తో ఆయన విమర్శకుల ప్రశంసలు పొందాడు. కాగా మూడో చిత్రాన్ని ఆయన పూరీజగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రవితేజకు 'ఇడియట్'గా, మహేష్‌కు 'పోకిరి'గా, ఎన్టీఆర్‌కు 'టెంపర్'గా.. ఇలా వరుణ్‌తేజ్‌కు 'లోఫర్' చిత్రం నిలుస్తుందని దర్శకనిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం ద్వారా మెగాహీరో మాస్ ప్రేక్షకులను కూడా అలరించడం ఖాయం అంటున్నారు. కాగా ఈ చిత్రం సి.కళ్యాణ్ నిర్మాణంలో సి.కె. ఎంట్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకొంది. కాగా ఈచిత్రం ఆడియోను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 18న విడుదల చేయనున్నారని విశ్వసనీయ సమాచారం.