Advertisementt

టాలీవుడ్‌ కి రెండు రాష్ట్రాలు ముఖ్యమే!

Tue 24th Nov 2015 04:49 PM
tollywood,telugu states,amaravati,hyderabad,telangana,andhra pradesh,soukyam,dictator  టాలీవుడ్‌ కి రెండు రాష్ట్రాలు ముఖ్యమే!
టాలీవుడ్‌ కి రెండు రాష్ట్రాలు ముఖ్యమే!
Advertisement
Ads by CJ

సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆడియో ఫంక్షన్లు అయినా సక్సెస్‌మీట్‌లు అయినా, ప్లాటినం డిస్క్‌ వేడుకలైనా హైదరాబాద్‌ అడ్డాగా సాగుతూ వస్తున్నాయి. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన సందర్భంలో ఇరు ప్రాంతాల ప్రేక్షకులను సమ దృష్టితో చూడటానికి టాలీవుడ్‌ ముఖ్యులు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఆడియో వేడుకను హైదరాబాద్‌లో చేస్తే, ప్లాటినం డిస్క్‌లను ఆంధ్రాలో జరిపేలా, ఆంధ్రాలో ప్లాటినం డిస్క్‌ వేడుక చేస్తే సక్సెస్‌మీట్స్‌ను హైదరాబాద్‌లో చేసేలా అందరూ ప్లాన్‌ చేస్తున్నారు.  ఆంధ్రా రాజధాని అమరావతిలో డిసెంబర్‌ 20 వతేదీన బాలకృష్ణ నటిస్తున్న 'డిక్టేటర్‌' ఆడియోను అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కొత్త రాజధానిలో జరుగుతున్న తొలి ఆడియో వేడుకగా ఈ చిత్రం చరిత్రలో నిలవనుంది. ఇక గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 'సౌఖ్యం' ఆడియో వేడుకను డిసెంబర్‌ 13న గోపీచంద్‌ సొంత ఊరు 'ఒంగోలు'లో భారీగా జరపడానికి రెడీ అవుతున్నారు. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇరు ప్రాంతాల ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాలలోనూ వేడుకలను జరపాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ