వర్మకు ఎప్పుడు కోపం వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎవరిపై వస్తుందో చెప్పడం కష్టం. కానీ తెలివిగా తనకు కోపం ఉన్న వారిని పొగుడుతూనే చిచ్చుపెడూతూ ట్విట్టర్ సాక్షిగా అందరినీ రెచ్చగొడుతుంటాడు. తాజాగా ఆయన 'అఖిల్'తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మీదనో, లేక 'బ్రూస్‌లీ' పరాజయంతో నిరాశకు లోనైన రామ్‌చరణ్‌నో... ఇలా వీరిద్దరినో టార్టెట్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్‌చేస్తూ.... సినీ వారసులు పాత ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఆ గీతను రాజ్‌తరుణ్ దాటాడు. అతడిని చూసి మన సినీ వారసులు నేర్చుకోవాలి.. అంటూ విమర్శల వర్షం కురిపించాడు. మరి ఆ సినీ వారసులు ఎవరు? అనేది మాత్రం ఆయన వీక్షకుల చాయిస్‌కే వదిలేశాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ... ట్రెండ్‌కు భిన్నంగా ఉన్న 'బాహుబలి, భలే భలే మగాడివోయ్', 'కుమారి 21ఎఫ్' వంటి సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని, ఈ విషయాన్ని పెద్ద హీరోలు గ్రహించాలని పేర్కొన్నాడు. అయితే ఇక్కడ ఆయన రాజ్‌తరుణ్‌ను పొగుడుతున్నట్లే కనిపించినప్పటికీ అతడిని ఇతర హీరోలపై ఓ ఆయుధంగా వాడుకొని, తన అవసరం నిమిత్తం పొగుడుతున్నట్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వర్మ చిత్రంలో నటించనని రాజ్‌తరుణ్ ఏకంగా వర్మకు మొహం మీదనే చెప్పేయడం, ఇక పూరీ చేయాలనుకున్న ప్రాజెక్ట్‌కు కూడా రాజ్‌తరుణ్ ఓకే చెప్పకపోవడంతో ఆయన్ను ఇతర హీరోల దృష్టిలో, ఇతర స్టార్స్ అభిమానుల దృష్టిలో విలన్‌గా చిత్రీకరించడానికే వర్మ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడని విశ్లేషిస్తున్నారు.