Advertisementt

ప్రకాష్‌రాజ్‌ డైరెక్ట్ చేసే కొత్త చిత్రమిదే!

Mon 23rd Nov 2015 06:09 PM
mana oori ramayanam movie,prakash raj,prakash raj mana oori ramayanam,ilayaraja,mega phone  ప్రకాష్‌రాజ్‌ డైరెక్ట్ చేసే కొత్త చిత్రమిదే!
ప్రకాష్‌రాజ్‌ డైరెక్ట్ చేసే కొత్త చిత్రమిదే!
Advertisement
Ads by CJ

గతంలో తెలుగులో 'ధోని, ఉలవచారు బిరియాని' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్టిస్ట్‌ ప్రకాష్‌రాజ్‌ త్వరలో మరో తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఆయన మెగాఫోన్‌ చేతబట్టే తన కొత్త చిత్రం టైటిల్‌ను, పోస్టర్స్‌ని ఫేస్‌బుక్‌ సాక్షిగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ఆయన తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. 'మన ఊరి రామాయణం' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఓ గ్రామంలో జరిగే కథ అంటున్నారు. ఇప్పుడు ఉన్న గ్రామాల పరిస్థితులు, అక్కడి సమస్యలను వినోదాత్మకంగా చర్చించటానికే ఈ చిత్రం కథాంశం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. అంతేకాదు.. ఈ సినిమాలోని ప్రధానపాత్రలన్నింటికీ కొత్తవారిని పరిచయం చేయనున్నాడట ప్రకాష్‌రాజ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ