మోహన్ బాబు గారి నలభై వసంతాల సినీ ప్రస్థానాన్ని పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మంచు వారికి గురు సమానులైనా దాసరి నారాయణ రావు గారి సమక్షంలో నిన్న ఓ చిన్న కార్యక్రమం తలపెట్టారు మంచు విష్ణు, మనోజ్ అండ్ లక్ష్మి ప్రసన్నలు. ఇక్కడ కూడా దాసరి గారి ప్రసంగం ఒక వైపు మోహన్ బాబు అధిరోహించిన నట శిఖరాలను కీర్తిస్తూనే మరో వైపు దిగజారిపోతున్న సినీ విలువల మీద కొరడా ఝుళిపించింది. అంతే కాకుండా దాసరి మాటల్లో ఎక్కడో తెలుగు పరిశ్రమలో చిన్న సినిమాలకు మళ్ళీ మంచి రోజులొచ్చాయి అన్న సంతోషం ధ్వనించింది.
అవే కథలను రిపీట్ చేస్తూ విపరీతంగా రోత పుట్టిస్తున్న పెద్ద సినిమాలను ప్రజలు తరిమికోడుతున్నారు. కొద్ది రోజులుగా చవిచూస్తున్న చిన్న సినిమాల విజయాలే దీనికి రుజువు అంటూ దాసరి గారు చెప్పుకొచ్చారు. రోత పెట్టిన పెద్ద సినిమాలు అంటే ఈ మధ్య విడుదలయ్యి దారుణమైన దిజాస్టర్లుగా నిలిచిన ఆ మూడు పెద్ద మూవీస్ గురించే పెద్దాయన ప్రస్థావించారన్నది అందరికీ అర్థమయిన విషయం. దాసరి గారు అన్నట్లుగా, మనం అనుకుంటున్నట్లుగా తుది శ్వాసతో వెంటిలేటర్ మీదున్న చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు మళ్ళీ ప్రాణం పోసే రోజులు తొందర్లోనే వచ్చేస్తున్నాయి.