పీవీపీ బ్యానర్ పేరు వింటేనే ఖర్చుకు వెనకాడని భారీ సంస్థ అన్న భావన కలుగుతుంది. వర్ణ లాంటి టెక్నికల్ వండర్ ప్రెజెంట్ చేసిన నిర్మాత ప్రసాద్ పోట్లురి నుండి రాబోతున్న కొత్త చిత్రంగా సైజు జీరో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విపరీతంగా లావెక్కిన అనుష్క, అటు పక్కనే సెక్సీగా కనిపిస్తున్న సోనాల్ చౌహన్ అండ్ హీరో ఆర్యాల కలయికలో వినుత్నమైన ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమాకు దర్శకత్వం, కథా, కథనాలు సమకూర్చుకున్నారు భార్యాభర్తలైన ప్రకాష్ కోవెలమూడి, కనిక ధిల్లాన్. ఇన్ని బడా పేర్లు సైజు జీరోతో అటాచ్ అయి ఉన్నప్పట్టికీ అనుష్క మీదే ఈ చిత్రం యొక్క వాణిజ్యం నిలబడి ఉందన్నది వాస్తవం. బాహుబలి, రుద్రమదేవిలాంటి సూపర్ హిట్ కళాఖండాలలో నటించి హీరోయిన్ అయినా తనకంటూ హీరోలతో సరిసమానంగా క్రేజ్ సంపాదించిన అనుష్క మార్కెట్ ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింది. అందుకే సైజు జీరోను ఓ సింపుల్ సినిమాగా కాకుండా ఓ స్టార్ హీరో సినిమాను ఎంత కోలాహలంగా విడుదల చేస్తారో, అంతటి హడావిడి కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో భారీగా రిలీజవుతున్న ఈ స్పెషల్ మూవీ స్వీటీ కీర్తి ప్రతిష్టలను ఎంతలా పెంచుతుందో వెయిట్ అండ్ సి.