అనుష్క ప్రధానపాత్రలో ఆర్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'సైజ్‌జీరో'. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ మూవీని పివిపి సంస్థ నిర్మించగా, నవంబర్ 27న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో నాగార్జున, రానా, జీవా, హన్సిక, తమన్నా, కాజల్ వంటి ఎనిమిది స్టార్స్ గెస్ట్‌పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ ఇటీవలే పూర్తయింది. కాగా సెన్సార్‌బోర్డు ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. క్లీన్ యు సర్టిఫికేట్ వస్తుందని ఆశించిన యూనిట్‌కు ఇది షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే తమిళంలో క్లీన్ యు చిత్రాలకు పలు రాయితీలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో ఆర్య, అనుష్క మధ్య ఓ ఘాటైన లిప్‌లాక్ సీన్‌తో పాటు పలు తెలుగు చిత్రాల్లో బికినీ అందాలతో సెక్సీగా కనిపించిన సోనాల్‌చౌహాన్ గ్లామర్ డోస్ కూడా బాగా చేసిందని, వీటన్నింటికీ దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రానికి 'యు' సర్టిఫికేట్ ఇవ్వకుండా 'యు/ఎ' సర్టిఫికేట్ ఇచ్చారని సమాచారం. మొత్తానికి అనుష్క అభిమానులకు మాత్రం ఈ లిప్‌లాక్ సీన్ ఐఫీస్ట్‌గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది.