Advertisementt

'బ్రహ్మోత్సవం' ఆగిపోయిందా..!

Mon 23rd Nov 2015 11:40 AM
brahmotsavam movie,brahmotsavam movie shooting stopped,mahesh babu,srikanth addala,srimanthudu  'బ్రహ్మోత్సవం' ఆగిపోయిందా..!
'బ్రహ్మోత్సవం' ఆగిపోయిందా..!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు హీరోగా పివిపి సంస్థ నిర్మాణంలో శ్రీకాంత్‌ అడ్డాల తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న 'బ్రహ్మోత్సవం' తాత్కాలికంగా ఆగిపోయిందని అంటున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం గమనించిన మహేష్‌ షూటింగ్‌ స్పాట్‌లో స్క్రిప్ట్‌వర్క్‌ చేయడం కరెక్ట్‌ కాదని.. కావాలంటే కావాలిసినంత టైమ్‌ తీసుకొని పక్కా స్క్రిప్ట్‌తోనే రావాలని శ్రీకాంత్‌ అడ్డాలకు ఖరాఖండీగా చెప్పాడట. పక్కా స్క్రిప్ట్‌ను ముందుగా చేసుకోవాలని, లాక్‌ చేసిన స్క్రిప్ట్‌తో షూటింగ్‌ సమయంలో మార్పులు చేర్పులు చేయడం వీలుకాదని మహేష్‌ చెప్పాడట. దీంతో శ్రీకాంత్‌ అడ్డాల ప్రస్తుతం స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో శ్రీకాంత్‌ అడ్డాల వాదన మరలా ఉంది. 'శ్రీమంతుడు' చిత్రంతో మహేష్‌బాబుకు ఉన్న ఇమేజ్‌ అనూహ్యంగా మారిపోయిందని, అందుకే స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహేష్‌కు తెలిపాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ