Advertisementt

సైన్స్ తెలియని లెక్కల మాస్టారు

Sun 22nd Nov 2015 06:53 PM
kumari 21 f,sukumar,kumari 21 f climax  సైన్స్ తెలియని లెక్కల మాస్టారు
సైన్స్ తెలియని లెక్కల మాస్టారు
Advertisement

ఇందాకే లెక్కల మాస్టారు సుకుమార్ గారు  కుమారి 21 ఎఫ్ కథను ఎక్కడి నుండో కాపీ కొట్టారని చదివాము. ఇది ఆయన్ని విమర్శించడానికి వాడుతున్న ఓ సినీ క్రిటిక్స్ ఆయుధంగా చెప్పుకుంటే సినిమా చివరాఖర్లో హీరోయిన్ మీనా కుమారి పాత్రని ముగ్గురు హీరో ఫ్రెండ్స్ చేత మానభంగం చేయించి ఆమెకు దీనివల్లే  కన్నెపొర చిరిగిపోయి రక్తస్రావం అయినట్టు చూపించడం సుకుమార్ కథనంలో మరో దారుణమైన, అసహ్యమైన పొర కింద కన్సిడర్ చేస్తున్నారు నేటి చదువుకున్న యువత. హీరోలోనో హీరోయిన్లోనో మార్పు రావడం కోసం ఇంకేదైనా కొత్త ఎత్తుగడ వేస్తాడనుకున్న సుకుమార్ మరీ బొత్తిగా బేసిక్ సైన్స్ కూడా తెలియని లెక్కల మాస్టారుగా సీన్ రాసేసుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. అన్నింటా తెలివిగా హై ఐక్యూతో ఆలోచించే సుకుమార్ కథ చివరి అంకాన్ని మాత్రం ఇంత ఫూలిషుగా ముగిస్తాడని ఆయన్ని ఆరాధించే, అభిమానించే ప్రేక్షకులు ససేమిరా అనుకోని ఉండరు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హేబా పటేల్ మధ్య రన్ అయిన సినిమాలోని మేజర్ కాన్ఫ్లిక్టు మీద కథను చివరంటా నడిపించి, ఇలా ఆఖరులో ఎటువంటి సైంటిఫికు సెన్సు లేకుండా ముగించిన ఘనత సుక్కుకే దక్కింది. తన గత చిత్రం నేనొక్కడినేలో ఎనలేని ఓ సైన్స్ ఎలిమెంట్ మీద కథ రాసుకున్న సుకుమార్ మరి కన్యత్వం మీద ఇంత చీపుగా ఎలా ఆలోచించాడా అన్నది ఇంకా అర్థం కావడం లేదు. అసలు రక్తస్రావం ఎప్పుడెప్పుడు, ఎందుకు అవుతుందో తెలియాలంటే సుక్కు సార్ మ్యాథ్స్ బుక్కులు వదిలి జీవశాస్త్రం నోట్స్ చదివితే కథకు మరికొంత బెటర్ ముగింపు పలికేవాడే.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement