లెక్కల టీచరుగా కాపీ కొట్టడాన్ని బల్లోనో, కాలేజీలోనో అరికట్టి ఉంటాడు గానీ సినిమా ఫీల్డులోకి వచ్చాక మాత్రం ఆ టీచరే ఇప్పుడు కాపీ మాస్టర్ అయ్యాడు. అందుకే సుకుమార్ గారి కుమారి 21 ఎఫ్ చిత్రం మీద ఇప్పుడు విశ్లేషకులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. పరభాషా సినిమాల నుండి స్ఫూర్తిని పొందడం వాటినే తర్జుమా చేయడం మన మేటి అగ్రశ్రేణి దర్శకులు కూడా అనుసరిస్తున్న వైఖరే. కానీ వీరందికి భిన్నంగా ఉండే శైలి సుకుమార్ గారిది కావడంతో కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని ఇంత పచ్చిగా మక్కీకి మక్కి దింపడంతో చాలా మంది విశ్లేషకులు ఖిన్నులయ్యారు. చూసి రాసినందుకు బాధలేదు, అది సుకుమార్ అయినందుకే వీరి తపన ఎక్కువగా ఉంది. ఫ్రెంచ్ సినిమా లీలా సేస్ నుండి ప్రాథమిక కథను, కథనాన్ని అలాగే ఆర్జెంటినా మూవీ సీక్రెట్ ఇన్ దేయీర్ అయిస్ నుండి ముగింపును పకడ్బందీగా లేపేసిన సుకుమార్ ఆ మాతృకలకు తగినంత మర్యాద ఇచ్చినట్టయితే ఇంతలా మంది పడేవారు కాదేమో. ఇంతోటి దానికి మళ్ళీ సుకుమార్ రైటింగ్స్ అని పెట్టుకునే బదలు సుకుమార్ చూచిరాతలు అని పేరు పెట్టుకుంటే సరిపోయేది కదా అన్నది ఓ సినిమా పిచ్చోడి సరదా వాదన.