Advertisementt

శ్రీశాంత్‌ సరసన హీరోయిన్‌ ఎవరు..?

Sat 21st Nov 2015 06:21 PM
sreeshanth,shanvi,sana yadireddy,lovely,adda movies  శ్రీశాంత్‌ సరసన హీరోయిన్‌ ఎవరు..?
శ్రీశాంత్‌ సరసన హీరోయిన్‌ ఎవరు..?
Advertisement
Ads by CJ

మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ హీరోగా టాలీవుడ్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్నిభాషల్లో తెరకెక్కించనున్నారు. శ్రీశాంత్‌కు కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో కొన్నిచిత్రాల్లో, గేమ్‌షోలలో నటించి ఉన్నాడు. కాగా శ్రీశాంత్‌తో హీరోగా నిర్మించే చిత్రాన్ని టాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ సానా యాదిరెడ్డి తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో శ్రీశాంత్‌ సరసన శాన్వి హీరోయిన్‌గా నటించనుంది. 'లవ్‌లీ, అడ్డా' వంటి చిత్రాల్లో గ్లామర్‌ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్‌పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసిన శాన్విని ఈ చిత్రానికి ఎంపికచేశారు. మరి చాలాకాలం గ్యాప్‌ తర్వాత సానాయాదిరెడ్డి చేస్తున్న ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాలి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ