రామ్‌చరణ్-శృతిహాసన్ కాంబినేషన్‌లో గతంలో 'ఎవడు' వచ్చి మంచి విజయం సాధించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయినా శృతిహాసన్ మాత్రం అందుకు సుముఖంగా లేదట. 'తని ఒరువన్' చిత్రాన్ని రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తమిళంలో హీరోయిన్‌గా నటించిన నయనతార పాత్రను తెలుగులో శృతిహాసన్ చేత నటింపజేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. కాగా శృతిని అడిగినప్పటికీ ఆమె డేట్స్ ఖాళీగా లేవని తిరస్కరించినట్లు సమాచారం. తను నాగచైతన్య హీరోగా రూపొందనున్న 'ప్రేమమ్' రీమేక్‌కు డేట్స్ ఇచ్చానని, అందుకే నో చెప్పాల్సి వస్తోందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ ఒక్క చిత్రానికి తప్ప వేరే ఏ సినిమాను ఒప్పుకోలేదని ఆమె తమిళ మీడియాకు తెలిపింది. మరి శృతి స్థానంలో రామ్‌చరణ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.