అజిత్ హీరోగా వచ్చిన 'వేదలమ్' చిత్రం అజిత్‌కు ఉన్న క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని స్టడీగా సాగుతూ సూపర్‌హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ చిత్రంపై ఇప్పుడు తెలుగు సినిమా హీరోల కన్నుపడింది. దీని రైట్స్ తీసుకొని పెద్ద హీరోల డేట్స్ సంపాదించాలని నిర్మాణ సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరో పక్క మన స్టార్ హీరోలు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని చేసి తమకు సెట్ అవుతుందో లేదో అనే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఈ రేసులో ఎన్టీఆర్, చిరంజీవిలు ముందున్నట్లు సమాచారం. గతంలో 'కత్తి' విషయంలో కూడా ఈ ఇద్దరు హీరోలు ఎంతో ఆసక్తి చూపించినప్పటికీ చివరకు ఆ ప్రాజెక్ట్ ఊసే ఇప్పుడు ఎత్తడం లేదు. దీంతో 'కత్తి' బాటలోనే 'వేదలమ్' కూడా చేరుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎలాగైన రీమేక్ చేయాలని ఎన్టీఆర్ పట్టుదలతో ఉన్నట్లు వార్తలు మాత్రం వస్తున్నాయి.