Advertisementt

అఖిల్ ను ఆదుకుంటున్న నాగ్..!

Fri 20th Nov 2015 05:11 PM
nagarjuna,akhil movie,40crores budget,akkineni akhil,nithin  అఖిల్ ను ఆదుకుంటున్న నాగ్..!
అఖిల్ ను ఆదుకుంటున్న నాగ్..!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేసిన 'అఖిల్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌, భారీ తారాగణం, స్టార్‌ డైరెక్టర్‌, స్టార్‌ నిర్మాత.. ఇలా అన్నింటిలోనూ భారీతనం కలగలిపిన ఈ చిత్రం తొలిరోజు ఓపెనింగ్స్‌ భారీగానే రాబట్టింది. కానీ అనూహ్యంగా రెండో రోజు నుండే థియేటర్లు నిండని పరిస్థితి ఏర్పడింది. మొదటిరోజు 10కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తర్వాతి నాలుగురోజుల్లో కేవలం 6కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. దాదాపు 40కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నిర్మాత నితిన్‌కు ఏకంగా 20కోట్ల నష్టాలు తప్పవని ట్రేడ్‌వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలే మిగిలాయి. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లలో నాగార్జున రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. నితిన్‌పై ఏ విధమైన ఒత్తిడి చేయవద్దని, భవిష్యత్తులో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలను రీజనబుల్‌ రేటుకు ఇప్పిస్తానని నాగ్‌ మాట ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఇబ్బందుల్లో పడతాడనుకున్న నితిన్‌ నాగ్‌ హామీతో ఊపిరి పీల్చుకున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ