మరలా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన 'సర్దార్‌గబ్బర్‌సింగ్' షూటింగ్‌లో బిజీ అయ్యాడు. ఇటీవలే ఆయన చంద్రబాబుతో భేటీ కావడంతో మరలా ఆయన రాజకీయాలతోనే ఎక్కువ కాలం గడిపేస్తాడని అందరూ భావించారు. కానీ పవన్ మాత్రం తన సినిమా మీదనే ఫోకస్ పెట్టాడు. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తన తాజా షెడ్యూల్ కోసం గుజరాత్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ 18వ తేదీ నుండి 30 వతేదీ వరకు పవన్‌కళ్యాణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ కాజల్ సైతం పాల్గొననుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరలా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీంతో టాకీపార్ట్ పూర్తవుతుంది. ఎలాగైనా టాకీపార్ట్‌ను జనవరి మొదటి వారం కల్లా ఫూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది. కాగా గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రాన్ని మార్చిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.