మూవీ డిస్ట్రిబ్యూటర్లలో నైజాం ఏరియాలో దిల్‌రాజుదే పైచేయి. ఇక్కడ ఇంకా కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నప్పటికీ దిల్‌రాజుతో పోటీపడేంత మాత్రం కాదు. అయితే చాలా కాలం తర్వాత నైజాం ఏరియాలో దిల్‌రాజు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కొత్తగా ఎంటర్ అయిన అతని పేరు అభిషేక్. అభిషేక్ పిక్చర్స్ సంస్థ పేరుతో సినీ డిస్ట్రిబ్యూషన్ నడుపుతున్న అతను ఇటీవల కాలంలో దిల్‌రాజుతో పోటీ పడుతూ సినిమాలను కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల కొన్ని సందర్భాల్లో దిల్‌రాజు అతని కంటే వెనకపడిపోయాడు. మహేష్‌బాబు హీరోగా వచ్చి కోట్లు కొల్లగొట్టిన 'శ్రీమంతుడు' నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకునేందుకు దిల్‌రాజుతో పాటు అభిషేక్ పోటీపడ్డాడు. చివరకు దిల్‌రాజు కంటే ఎక్కువ మొత్తం చెల్లించి 14.5కోట్లకు ఈ చిత్రం హక్కులను అభిషేక్ పొందాడు. ఈ సినిమాతో ఆయనకు ఐదు కోట్ల లాభం వచ్చిందని సమాచారం. తాజాగా ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని కూడా ఆయన దిల్‌రాజును పక్కనపెట్టించి రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హక్కులు సొంతం చేసుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో అభిషేక్ మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచిచూడాల్సివుంది.