Advertisementt

కొరటాల బంగారానికే.. ఎన్టీఆర్‌ ఫిక్స్!

Fri 20th Nov 2015 04:47 PM
jr ntr,shruti haasan,koratala siva,mahesh babu,srimanthudu,shruti haasan in koratala siva and ntr movie  కొరటాల బంగారానికే.. ఎన్టీఆర్‌ ఫిక్స్!
కొరటాల బంగారానికే.. ఎన్టీఆర్‌ ఫిక్స్!
Advertisement
Ads by CJ

చిత్రసీమలో సెంటిమెంట్స్‌ ఎక్కువ. ఫ్లాప్‌ సినిమాలో జోడీ కట్టిన హీరోయిన్లతో కలిసి నటించడానికి హీరోలు కాస్త వెనుకంజ వేస్తారు. అయితే ఎన్టీఆర్‌కు మాత్రం ఫ్లాప్‌ హీరోయిన్‌తో నటించడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అసలు విషయానికి వస్తే త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ పరిణితీచోప్రాను అనుకున్నారు. కానీ ఆమె హ్యాండిచ్చింది. దీంతో ఎన్టీఆర్‌ జోడీ కోసం మరో హీరోయిన్‌ను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఈ ప్రాజెక్ట్‌ శృతిహాసన్‌ వరకు వెళ్లి ఆగింది. ఎన్టీఆర్‌-శృతిహాసన్‌ కాంబినేషన్‌లో గతంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం వచ్చి డిజాస్టర్‌ అయింది. దాంతో ఎన్టీఆర్‌ శృతితో చేయాలా? వద్దా? అనే సందిగ్దంలో పడిపోయాడట. ఆయన సన్నిహితులు కూడా ఆమెతో చేయవద్దు అని సలహా ఇచ్చారట. కానీ కొరటాల శివ మాత్రం శృతిహాసన్‌నే ఫైనల్‌ చేసినట్లు సమాచారం. కొరటాల డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా వచ్చిన 'శ్రీమంతుడు' నాన్‌ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ సెంటిమెంట్‌తోనే తన బంగారాన్నే రిపీట్‌ చేయాలని కొరటాల పట్టుబట్టడంతో దీనికి ఎన్టీఆర్‌ కూడా పచ్చజెండా ఊపాడట. ఈసారైనా వీరిద్దరి జోడీ బంపర్‌హిట్టు కొడుతుందా? కొరటాల సెంటిమెంట్‌ ఎంతవరకు ఓకే అవుతుంది? లేక ఎన్టీఆర్‌ ఫ్లాప్‌ సెంటిమెంట్‌ ఈసారి కూడా రిపీట్‌ అవుతుందా? లేదా? అనేవి వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ