Advertisementt

ఈ యంగ్ హీరో.. డైరెక్టర్ అవుతాడంట!

Fri 20th Nov 2015 01:34 PM
raj tarun,young hero,director,sunil,allu arjun,raj tarun future dreams  ఈ యంగ్ హీరో.. డైరెక్టర్ అవుతాడంట!
ఈ యంగ్ హీరో.. డైరెక్టర్ అవుతాడంట!
Advertisement
Ads by CJ

'ఉయ్యాలా  జంపాలా, సినిమా చూపిస్త మావ' వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌హిట్లు సాధించిన యంగ్‌హీరో రాజ్‌తరుణ్‌ ఇప్పుడు ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. మరో రెండేళ్ల వరకు రాజ్‌తరుణ్‌ డేట్స్‌ ఖాళీ లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 'కుమారి 21ఎఫ్‌' తో విజయం సాధిస్తే తప్పకుండా తన రెమ్యూనరేషన్‌ పెంచుతానని పబ్లిక్‌గానే చెబుతున్నాడు ఈ కుర్రాడు. వాస్తవానికి రాజ్‌తరుణ్‌ సినిమా ఫీల్డ్‌లో డైరెక్టర్‌ అవ్వాలని భావించి లక్కీగా హీరో అయిపోయాడు. సునీల్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ కూడా రాసుకున్నాడట. అలాగే ఆయన త్వరలో బన్నీకి కూడా సరైన కథ రాస్తాడట. ఎందుకంటే తనకు సునీల్‌, బన్నీలు ఫేవరేట్‌ హీరోలు అని చెబుతున్నాడు. అన్ని సజావుగా సాగితే దర్శకునిగా మారి సునీల్‌తో సినిమా చేస్తాను అంటున్నాడు. రాజ్‌తరుణ్‌ ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ, గీతాఆర్ట్స్‌, వంశీ 'లేడీస్‌ టైలర్‌', మంచు విష్ణు చిత్రాలు ఉన్నాయి. రాజ్‌తరుణ్‌ నటించిన 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు' చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుపుకుంటోంది. 'కుమారి 21ఎఫ్‌' తర్వాత విడుదయ్యే రాజ్‌తరుణ్‌ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ