Advertisementt

ప్రేమలు అచ్చిరాని అమ్మడు పెళ్ళికి

Thu 19th Nov 2015 07:48 PM
nayanathara,vigensh shivan,nayanathara marriage  ప్రేమలు అచ్చిరాని అమ్మడు పెళ్ళికి
ప్రేమలు అచ్చిరాని అమ్మడు పెళ్ళికి
Advertisement
Ads by CJ

శింబుతో, ప్రభుదేవతో రెండు సార్లు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి పెళ్లి సమయానికి దురదృష్టం తన్నడంతో వ్యక్తిగతంగా బాగా దెబ్బ తిన్న నయనతార, ఇంకా గుణపాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ప్రేమ అనేది అమ్మడి ఒంటికి పడదని, ఏదైనా ఉంటె సరాసరి పెళ్లి పీటల మీదే కూర్చుంటే లైఫ్ సెటిల్ అయిపోద్దని దగ్గరి బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహా ఈవిడ చెవికి, బుర్రకి ఎక్కినట్టు లేదు. అందుకే మరోసారి నయనతార ప్రేమాయణం దక్షినాది సినిమా జనాల్లో హాట్ టాపిక్ అయింది. యాక్టర్, డైరెక్టర్, రచయిత విగ్నేష్ శివన్ మరియు నయనతార జంటగా తిరుగుతున్నారని ఇంతకు మునుపు పుకార్లు చెలరేగినా అబ్బే అదేం లేదండి అంటూ బుకాయించారు. వీరిద్దరి సాన్నిహిత్యాన్ని తెలిపే చిత్రాలు కొన్ని అంతర్జాలంలో విహరించినా కొందరు నమ్మింది లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం, విగ్నేష్ లేకుండా నయనతార ఒక్కరోజు కూడా గడప లేక పోతోందట. అందుకే విగ్నేష్ ఏదో సినిమా విషయమై పరదేశం పయనమైతే నయనతార కూడా రెక్కలు కట్టుకొని ఎవరికీ చెప్పకుండా ప్రియుడి చెంత వాలిపోయిందట. ఇద్దరు కలిసి ఆ దేశంలోని బీచుల్లో సరసాలాడుతూ భారతీయ సంతితికి దొరికిపోయారని తెలుస్తోంది. ఇకనైనా ప్రేమాయనాలు చాలించి బుద్ధిగా వివాహం వైపు చూపు మరలిస్తే నయనకు మంచిది, లేకపోతే మరో ఎదురుదెబ్బ తగలదని గ్యారంటీ ఏమీ లేదు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ