Advertisementt

గాలి కోసమైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలేమో!

Thu 19th Nov 2015 06:51 PM
prabhas,naga chaitanya,marriage news  గాలి కోసమైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలేమో!
గాలి కోసమైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలేమో!
Advertisement
Ads by CJ

పెళ్లి చేసుకుంటే పడాల్సిన కష్టాలెన్నో పెళ్ళయి సంసార సాగరాన్ని ఈదుతున్న ఎవడిని అడిగిన బ్రేక్ లేని సీరియలులాగా వాయించేస్తారు. మరి అదే పెళ్లి కాని సెలబ్రిటీల బతుకు ఎలా బస్టాండు అవుతుందో నాగ చైతన్య, ప్రభాస్ లాంటి ముదర బ్రహ్మచారుల ఘోడు వింటే తెలుస్తుంది. ఈడు పైబడ్డా కెరీర్ కోసమే మా జీవితం అంటున్న ఈ హీరోలకు గాసిప్పు వీరుల నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మీరు పెళ్లి చేసుకుంటారా లేక మా పని మమ్మల్ని చేసుకోమంటారా అన్నట్టుగా ప్రభాస్, చైతుల పెళ్ళిళ్ళ మీద వీర లెవెల్లో పుకార్లు షికార్లు పుట్టిస్తున్నారు. మొన్నటి వరకు ప్రభాస్ రాజుకి ఓ ప్రముఖ రాజకీయ నాయకురాలితో లింకు పెట్టిన ఘనాపాటీలు నిన్న అదే ప్రభాస్ పెళ్లి భీమవరంకు చెందిన ఓ అందమైన అమ్మాయితో ఫిక్స్ అయిందని విన్నవించారు. అన్నీ తుస్సని అంతలోనే తేలిపోయింది అనుకోండి. అలాగే చైతు విషయంలో కూడా ముందుగా అనుష్కా అన్నారు అటు తరువాత ఇప్పుడేమో పేరు చెప్పకుండా చైతుతో తెర మీద రొమాన్స్ చేసిన ఓ హీరోయిన్ ఇప్పుడు అతని జీవిత భాగస్వామి కాబోతుంది అంటున్నారు. ఇదీ ఒట్టి గాలివాటం కబురే అనుకోండి, చదువుకునే వారికి మాత్రం భలే మజా. అందుకే అంటున్నాం.. ఈ గాలిరాయుళ్ళ కోసమైనా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలేమో.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ